వివక్షా రహిత సమాజం – ఒక ఉమ్మడి ప్రయత్నం — మనలోమనం మొట్ట మొదటి సమావేశ వివరాలు

వివక్షా రహిత సమాజం – ఒక ఉమ్మడి ప్రయత్నం-మనలోమనం  

మనిషి సామూహిక జీవనం నుంచి విడి వడి వ్యక్తిగత ప్రయోజనాల సాధనే ఏకైక లక్ష్యంగా రూపాంతరం చెందడం వెనుక ఒక చారిత్రక

మనలోమనం మొట్ట మొదటి సమావేశం

క్రమం వుంది. అవసరాలు, అన్వేషణాశక్తి పునాదులుగా మార్పు చెందిన మనిషి ఈ రోజు ఒంటరి పోరాటాల్లోని క్లిష్టతను గుర్తించాడు. వేర్వేరు సమస్యల్ని ఎదుర్కొనే వర్గాలు ఉమ్మడి శత్రువుతో పోరాడటానికి ఐక్య సంఘటనలు కడుతున్న రోజులివి. సమిష్టితత్వంలోని బలాన్ని గుర్తిస్తూ కొన్ని తాత్కాలిక సర్దుబాట్లతో ప్రజాస్వామిక దృక్పధంతో ఇలాంటి కూటములు ఏర్పాటవుతున్నాయి.1980 ల తర్వాత స్త్రీవాద ప్రభావంతో తెలుగు సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయి. ఇదివరకటిలా స్త్రీలు ఇపుడు విస్తృత వస్తువులు కారు. గత ముప్పయ్యేళ్లలో స్త్రీవాదం అనేక కోణాల్లోకి విస్తరించింది. స్త్రీలుగా తాము లింగవివక్షకు గురికావడంతో పాటు కుల, మత, ప్రాంత సమస్యలు తమని ఎంత అణిచివేస్తున్నాయో రచయిత్రులు గుర్తిస్తున్నారు. అందుచేతనే దళిత, బహుజన, మైనారిటీ, ఆదివాసీ స్త్రీల సాహిత్యం ఇపుడు చర్చలోకి వస్తుంది. అయితే వివిధ దృక్పధాలకి చెందిన రచయిత్రులు ఒక వేదిక మీదికి రావడం పరస్పర అవగాహనతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసుకోవడం లాంటి ప్రయత్నాలు గతంలో కొన్ని జరిగినప్పటికీ అవి ఎక్కువకాలం నిలబడలేదు. సమిష్టికృషికి సిద్ధంగా ఉన్న రచయిత్రుల సహకారంతో మనలోమనం నిర్వహణ కమిటి చొరవతో ఉమ్మడి వేదిక ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి……….

పైన పేర్కొన్న  మనలోమనం మొట్ట మొదటి సమావేశ రిపోర్ట్ పూర్తి   వివరాలు, ఫోటోల కు  మనలోమనం ప్రత్యేక పేజీ  చూడండి.

ప్రకటనలు

4 thoughts on “వివక్షా రహిత సమాజం – ఒక ఉమ్మడి ప్రయత్నం — మనలోమనం మొట్ట మొదటి సమావేశ వివరాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s