మనలో మనం సదస్సు కు ఆహ్వానం
ప్రాంతాలవారీగా , అస్థిత్వాల వారీగా స్త్రీల సాహిత్య చరిత్రను సమగ్రం చేసుకోవడం లో భాగంగా “మనలోమనం” రచయిత్రుల ఉమ్మడివేదిక ఇప్పటివరకు తెలంగాణా,రాయలసీమల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సులను ఏర్పాటు చేసింది. కొత్త తరం రచయిత్రులను గుర్తించి , ప్రోత్సహించింది. అంతే కాక విద్యార్ధినుల్లో రచనాసక్తి పెంపొందిచేలా కృషి జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు “మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం , నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది. కోస్తాంధ్ర , వెనుకబడిన తరగతుల , క్రైస్తవ , మైనారిటీ స్త్రీల కు సంబంధించిన సాహిత్యం పై చర్చ , పత్రసమర్పణలు జరుగుతాయి .
సమావేశ స్థలం :
ప్రొ.వి .బాలమోహనదాస్ సెమినార్ హాల్ ,
డైక్మన్ ఆడిటోరియం ,
నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జున నగర్
రచయిత్రులారా ! విస్మరించబడిన మన సాహిత్యచరిత్రను మనమే నిర్మించుకుందాం రండి. మీ రాక ఈ సదస్సుకి బలాన్ని చేకూరుస్తుంది. మరిన్ని ఇతర వివరాలకు…
ఆచార్య తేళ్ళ సత్యవతి 9848531931
డాక్టర్ సమత రోష్ని 9491053654
పుట్ల హేమలత 9441241316
పి. రాజ్యలక్షి 9440286746
హేమలత 9912195330
“మనలోమనం“
రచయిత్రుల ఉమ్మడి ఐక్య వేదిక