ఇప్పటి వరకూ
కలసి వుంటే ఎంత సుఖము కలదో
విడిపోతే ఎంత దుఖమో
మీరు చెప్పారు……….
ఇప్పటి వరకూ
మీరెట్లా మమ్మల్ని అణచి వుంచారో
మేమెట్లా అగ్నిజ్వాలలై ఎగిసామో
మేము చెప్పాము.
ఇక అనివార్యత లోంచి పంపకాల గురించి
మాట్లాడుకునేపుడు
నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో
అడుగుతావనుకుంటే……….
హైదరాబాద్ ని అడిగావు
నువ్వు ఇరానీ చాయ్ గురించో హైదరాబాద్ బిర్యానీ గురించో
విచారిస్తావనుకుంటే
మా పెట్టుబడుల సంగతేంటి అన్నావ్
నీ సంగతి మా బాగా అర్ధమయ్యాక కూడా
ఒకటి చెప్పాలనిపిస్తుంది
మనమిపుడు ఎదురెదురుగా కూర్చుందాం
హృదయాలు తెరిచి ప్రేమ కధలు చెప్పుకుందాం
8 వ్యాఖ్యలు
hi
nothing
Hi Malleswari garu.
mee posts baagunnayi..
nice one,
first time mee blig chaduvutunnanu. congrats. sep. 2012 visalaskhi sahitya masa patrika lo mee katha samputi pai gudipati garu rasina review prachurincharu.
సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.మీరు బ్లాగ్ ని చదినందుకు,
జాజిమల్లి సమీక్ష గురించిన సమాచారం తెలిపినందుకు…
ఎవరు ఎవ్వరితో ఈ సంభాషణ? కవిత్వంలో కథగాని సంగీతం గాని వెతుక్కునే వాణ్ణి. శీలా వీర్రాజు గారి పద చిత్రాలు కొన్ని కనుపించేయి. నర్మగర్భంగా నడచిన కవిత.
Very nice andee.